- District News
- Khammam
- రైతాంగం కదలాలి.. ఖమ్మం దద్దరిల్లాలి!
రైతాంగం కదలాలి.. ఖమ్మం దద్దరిల్లాలి!
ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలకు భారీ తరలింపు.. పేరేపల్లిలో ఇంటింటా విస్తృత ప్రచారం
కారేపల్లి, సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్ న్యూస్):
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. మహాసభల ప్రారంభం సందర్భంగా ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఎస్సార్ అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీ గ్రౌండ్ వరకు వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు. మహాసభలకు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ శనివారం కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామంలో ఏఐకేఎంఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధన కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రైతులు, కూలీలు ఐక్యంగా కదిలి ఖమ్మం మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మహాసభలు, భారీ ప్రదర్శన, బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలను సమీకరించేందుకు గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తామని తెలిపారు.
