- District News
- Khammam
- కారేపల్లి జెడ్పీ పాఠశాలలో చోరీ కలకలం
కారేపల్లి జెడ్పీ పాఠశాలలో చోరీ కలకలం
50 మీటర్ల విద్యుత్ వైర్లు, పైపులు అపహరణ.. పోలీసులకు హెచ్‌ఎం ఫిర్యాదు
ఖమ్మం జిల్లా, కారేపల్లి ( సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 14 : మండల కేంద్రమైన కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ వైర్లు, వాటికి సంబంధించిన పైపులను చోరీ చేసిన ఘటన వెలుగుచూసింది. పాఠశాల ఆవరణలో సుమారు 50 మీటర్ల మేర విద్యుత్ వైర్లతో పాటు వాటిని అమర్చిన పైపులను దుండగులు అపహరించినట్లు పాఠశాల హెచ్‌ఎం సల్మాన్ రాజు తెలిపారు. శుక్రవారం పాఠశాలను స్థానిక సర్పంచ్ మేదరి టోనీ, పంచాయతీ కార్యదర్శి నెహ్రూ సందర్శించిన సందర్భంగా విద్యుత్ వైర్లు, పైపులు కనిపించకపోవడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల హెచ్‌ఎం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించి, చోరీకి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పాఠశాల ప్రాంగణంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
