పేద కుటుంబానికి పెద్దన్నలా ఎంపీ రఘురాం రెడ్డి.. సూరపాక కృష్ణకు వైద్యసాయం

రూ.75 వేల విలువైన ఎల్‌ఓసీ మంజూరు.. నిమ్స్‌లో శస్త్రచికిత్సకు తక్షణ చర్యలు

Published On
పేద కుటుంబానికి పెద్దన్నలా ఎంపీ రఘురాం రెడ్డి.. సూరపాక కృష్ణకు వైద్యసాయం

ఖమ్మం జిల్లా, కారేపల్లి(సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 7 : ఆపదలో ఉన్న పేద కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకున్నారు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి. సింగరేణి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన సూరపాక కృష్ణ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చేతికి శస్త్రచికిత్స అవసరమైన విషయం తెలుసుకున్న ఎంపీ వెంటనే స్పందించి వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు.
కృష్ణకు నిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అవసరమని కాంగ్రెస్ నాయకులు మల్లెల నాగేశ్వరరావు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన రఘురాం రెడ్డి నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు రూ.75 వేల విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేయించారు.
మంజూరైన ఎల్‌ఓసీ కాపీని మల్లెల నాగేశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తమకు అండగా నిలిచి, చికిత్సకు సహాయం అందించిన ఎంపీ రఘురాం రెడ్డికి కృష్ణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు చొరవ చూపుతున్న ఎంపీ రఘురాం రెడ్డి సేవలను స్థానికులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News