రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  

వరి పంటలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి: బీజేపీ హెచ్చరిక
Published On
రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  

 

 

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

కేశంపేట మండలం: రైతుల విజ్ఞప్తి మేరకు కేశంపేట మండలంలోని కొత్తపేట, సంతపూర్, నిర్దేవెల్లి గ్రామాల్లో వరి పంటలను బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వరి పంటల దుస్థితిని పరిశీలించగా అనేక ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 వరి పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరతతో రైతుల్లో ఆందోళన

ప్రస్తుతం వరి పంటలు కీలకమైన దశలో ఉన్నాయని, గింజ గట్టిపడే సమయంలో నీరు అందకపోతే పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము పరిశీలించిన సుమారు 100 ఎకరాల వరి పంటలో దాదాపు 50 ఎకరాలకు మాత్రమే కొంతమేర నీరు అందుబాటులో ఉందని, మిగిలిన 50 ఎకరాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. అందులో సుమారు 15 ఎకరాల పంట ఇప్పటికే ఎండిపోయే దశకు చేరుకుందని పేర్కొన్నారు.ఇదే పరిస్థితి మరో 15 నుంచి 20 రోజుల పాటు కొనసాగితే రైతులు పూర్తిస్థాయిలో పంట నష్టపోయే ప్రమాదం ఉందని, అప్పులు చేసి సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

 అందుతున్న విద్యుత్ కూడా నిరంతరాయంగా లేకపోవడంతో ఇబ్బందులు

రైతులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువస్తూ, వ్యవసాయానికి కేటాయించిన విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. విద్యుత్ ఒక గంటకు ఒకసారి నిలిచిపోవడం, తిరిగి సరఫరా అయ్యేలోపు మోటార్ల ద్వారా నీరు సక్రమంగా పారకపోవడం వల్ల పొలాలకు తగినంత నీరు అందడం లేదని వాపోయారు. తక్కువ వోల్టేజీ సమస్యలు కూడా ఇబ్బందులకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం కేటాయిస్తున్న విద్యుత్ గంటలలోనైనా నిరంతరాయంగా, తగిన వోల్టేజీతో సరఫరా చేస్తే తమ పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు విజ్ఞప్తి చేశారు.

 పరిశ్రమలకు కొంతసేపు విద్యుత్ తగ్గించి రైతులకు అందించాలి.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ.. షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలకు తాత్కాలికంగా కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాను తగ్గించి, ఆ విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకు మళ్లించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ నిర్వహణతో పాటు రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యలతో నష్టపోవడం బాధాకరమని, అన్నదాతల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు.

 IMG-20261009-WA0107

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మరో నాలుగు రోజుల్లో విద్యుత్ సరఫరా సమస్యకు పరిష్కారం చూపకపోతే షాద్‌నగర్ నియోజకవర్గంలోని విద్యుత్ సబ్‌స్టేషన్లను ముట్టడించి రైతుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పంటలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, అన్నదాతలకు న్యాయం జరిగే వరకు బీజేపీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ నియోజకవర్గం ధార్మిక సెల్ కన్వీనర్ పసుల నరసింహ యాదవ్, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్, సీనియర్ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి, సిల్వర్ లింగయ్య, వేణుగోపాల్, ఆకుల గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, సాయి, సత్యం, మహాలింగం, అమర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి,మురళి, శ్రీశైలం, హరికృష్ణ, బీరస్వామి, ఎల్లయ్యా, కుమ్మరి వెంకటేష్, యాదగిరి, శేఖర్ రెడ్డి, కృష్ణయ్య,లింగయ్య,సత్యనారాయణ, శేఖర్,మరియు రైతులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

నాదర్గుల్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ మృతి.  నాదర్గుల్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ మృతి. 
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని మృతి, పలువురు విద్యార్థులకు గాయాలు.  కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ డిమాండ్,  భారీగా మోహరించిన పోలీసులు
గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్