ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!

ఉత్తమ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవార్డు, భారత్ కళా పురస్కార్–2026 అందుకున్న ముత్యాల నాగేశ్వరరావు

Published On
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!

 

 

IMG-20261004-WA0133

ఖమ్మం రూరల్ పెద్దతండా సాయిప్రభాత్ నగర్‌కు చెందిన ముత్యాల నాగేశ్వరరావు ఫోటోగ్రఫీ రంగంలో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఉత్తమ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు ఉత్తమ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవార్డుతో పాటు భారత్ కళా పురస్కార్–2026 లభించాయి.

హైదరాబాద్ శంషాబాద్‌లోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న ఫోటో ట్రేడ్ షో సందర్భంగా సిగ్మా ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ట్రేడ్ షో నిర్వాహకులు సంయుక్తంగా జాతీయ స్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ పోటీల్లో నాగేశ్వరరావు తన ప్రత్యేక ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని ప్రదర్శించి అవార్డులకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు, ఫోటోగ్రఫీ రంగ ప్రముఖుల చేతుల మీదుగా నాగేశ్వరరావు ఉత్తమ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవార్డు, భారత్ కళా పురస్కార్–2026 అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

అవార్డులు అందుకున్న అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ తన ఫోటోగ్రఫీ ప్రతిభను గుర్తించి అవార్డులకు ఎంపిక చేసిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఫోటోగ్రఫీ ప్రయాణంలో సహకరిస్తున్న కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత నాణ్యమైన ఫోటోగ్రఫీతో ఈ రంగంలో ముందుకు సాగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిగ్మా ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎం.సి. శేఖర్, ట్రేడ్ షో నిర్వాహకులు ఎడిట్ పాయింట్ రమేష్, ఫోటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి తదితరులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి