- District News
- వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చ...
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి:
వికారాబాద్ సీపీఎం కార్యదర్శి ఆర్ మైపాల్ డిమాండ్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు కుళ్ళిపోయిన కూరగాయలతో నాణ్యత లేని వంటకాలు చేసి పెడుతున్న కాంట్రాక్టర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం సీపీఎం నాయకులు ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అనంతరం భోజన తయారీ వంటగదిని పరిశీలించారు.
నాణ్యత లేని ఆహారం – పట్టించుకోని కాంట్రాక్టర్
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ మాట్లాడుతూ... మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు అందించాల్సిన భోజనం, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, టిఫిన్లు ఏవీ సక్రమంగా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు చేస్తూ రోగుల ఆరోగ్యాంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా మారని వైఖరి
ఈ విషయామై గతంలో అనేకసార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ కాంట్రాక్టర్, వంట సిబ్బంది వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడం విచారకరమన్నారు.
చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తాం
ప్రభుత్వం తక్షణమే స్పందించి సదరు కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్ట్‌ను రద్దు చేసి నూతన కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
End
