అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు

బిజెపి రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు 

Published On
అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు

 

 

వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో :

అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించి, బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్, వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, పార్టీ మాజీ అధ్యక్షులు సదానంద రెడ్డి, అమరేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించిన 'అవంతిక కన్స్ట్రక్షన్స్' నిర్వహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి, జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల లక్ష్మయ్య, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రాఘవేందర్, మీడియా ఇన్‌చార్జ్ మోహన్ రెడ్డి, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి