అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్

ఎమ్ఎస్ఎఫ్ జాతీయ సదస్సును విజయవంతం చేయండి — ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొలికపోగు కాంతారావు పిలుపు

Published On
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్

 

 

​లోకల్ గైడ్ : అశ్వారావుపేట 
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించనున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్  రాష్ట్ర కార్యదర్శి కొలికపోగు కాంతారావు మాదిగ పిలుపునిచ్చారు. ​ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉన్నందున, గ్రామాల్లోని ఉద్యమకారులు, నాయకులు సమష్టిగా కృషి చేయాలన్నారు. మండల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి క్రమశిక్షణ, సరైన డ్రెస్ కోడ్ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధం చేయాలని కోరారు. ​సదస్సు విజయవంతానికి ప్రతి ఒక్క నాయకుడు, నాయకురాలు బాధ్యత తీసుకుని, ఒక్కొక్కరు కనీసం ముగ్గురు విద్యార్థులను సమీకరించి భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సును విజయవంతం చేసి ఉద్యమ స్ఫూర్తిని చాటాలని ఆయన ఆకాంక్షించారు. ​ఈ విలేకర్ల సమావేశంలో కొలికపోగు క్రాంతికుమార్, రాయల పుల్లారావు, రావూరి వీరయ్య, దాట్ల అశోక్, సాయి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి