- District News
- Ranga Reddy
- అక్టోబర్ 8న ఆర్టీసీ ఎక్స్ రోడ్ బస్ భవన్ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచి...
అక్టోబర్ 8న ఆర్టీసీ ఎక్స్ రోడ్ బస్ భవన్ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి
షాద్ నగర్ లో పోస్టర్ను ఆవిష్కరించిన ఎన్పి ఆర్డి సభ్యులు
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం అక్టోబర్ 8న ఆర్టీసీ ఎక్స్ రోడ్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భుజంగారెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులు విద్య, వైద్యం, ఉపాధి, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం నిత్యం ప్రయాణాలు చేయాల్సి వస్తోందన్నారు. పరిమిత ఆదాయం కలిగిన అనేక మంది దివ్యాంగులకు ప్రయాణ ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.దివ్యాంగులకు అందాల్సిన హక్కులు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 8న నిర్వహించే ధర్నాను విజయవంతం చేసేందుకు జిల్లాలోని దివ్యాంగులు, హక్కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల హక్కుల కోసం జరిగే పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్పిఆర్డి టౌన్ ప్రెసిడెంట్ ఎస్ చెన్నయ్య, జిల్లా నాయకులు హెచ్ నెహ్రూ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
