ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Published On
ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 22 లోకల్ గైడ్ 

కామారెడ్డి జిల్లా  నర్సంపల్లి గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారంపరిశీలించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన తీరును పరిశీలించిన కలెక్టర్, ఇంటి లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా అందిన సహాయం, ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ సమయంలో ఎదురైన ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి అందిన ప్రోత్సాహం తదితర అంశాలపై లబ్ధిదారులతో మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హిమబిందు, ఎంపీడీవో హెప్సిబా రాణి, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ రవి, తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు అనంతగిరి హిల్స్ రన్: విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు
        వికారాబాద్ (లోకల్ గైడ్) జిల్లా బ్యూరో : అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌లో 'అవంతిక కన్స్ట్రక్షన్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 5, 16, మరియు 32 కిలోమీటర్ల
ఖమ్మం ఫోటోగ్రాఫర్‌ ముత్యాల నాగేశ్వరరావుకు జాతీయ కీర్తి!
వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 
_మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
అక్టోబర్ 6న ఛలో హైదరాబాద్
సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 
అక్టోబర్‌ 8న ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌  బస్ భవన్‌ ఎదుట ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించాలి