- District News
- Khammam
- పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...
లోకల్ గైడ్' ఖమ్మం
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర డీజిపీ శ్రీ సివి ఆనంద్ అన్నారు.
జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వాటి నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
సాధారణ దొంగతనం కేసుల కంటే సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని,. సమాజంలో మారుతున్న సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ళు వేల కోట్లు దోచుకుంటున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్ని ప్రజలను చైతన్యం పరచాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి
రహదారి భద్రతను మెరుగుపరచడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి ట్రాఫిక్ మేనేజ్ మెంట్ ఖచ్చితమైన అమలు చేయాలన్నారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ లైంగిక వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు వంటి సమస్యలను అరికట్టడానికి షీ టీమ్స్ భరోసా కేంద్రాలు వంటి ప్రత్యేక విభాగాలు నిరంతరం పనిచేయాలని అన్నారు.
విజిబుల్ పోలీసింగ్ ద్వారా రాత్రి వేళల్లో గస్తీ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, విస్తృత వాహన తనిఖీలు చేపట్టాలన్నారు.
సమాజంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు వ్యవస్థకు పారదర్శకత అనేది అత్యంత ప్రాముఖ్యమైనదని, ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందిస్తుందన్నారు.
నేర రహిత సమాజం, కఠినమైన చట్టాల అమలు కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరమని అన్నారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్
పలు అంశాలపై వివరించారు.
