- District News
- Ranga Reddy
- మేడిగడ్డ తండాలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
మేడిగడ్డ తండాలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో నూతన బోరు డ్రిల్లింగ్ పనులు ప్రారంభం
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 13:
ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్, ఉప సర్పంచ్ విజయ్ రాథోడ్ తెలిపారు.
గురువారం మేడిగడ్డ తండాలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు నూతన బోరు డ్రిల్లింగ్ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లేష్, దేవేందర్, జయందర్, కవిత, మణిపాల్, సితి భాస్కర్, ప్రేమలత, హన్మ తదితరులతో పాటు గ్రామస్తులు పరమేశ్వర్, పాండు, హరిలాల్, గంగా తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 11:01:13
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
