- District News
- Khammam
- ప్రజా పోరాటాలే ఏచూరికి నిజమైన నివాళి
ప్రజా పోరాటాలే ఏచూరికి నిజమైన నివాళి
Published On
By Ram Reddy
నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా మార్క్సిజాన్ని అన్వయిస్తూ ప్రజా ఉద్యమాలకు దిశానిర్దేశం చేసిన సీతారాం ఏచూరి నిజమైన మార్క్సిస్టు యోధుడని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని పురస్కరించుకుని కారేపల్లి, మాణిక్యారం గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం స్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కే. నరేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏచూరి చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు తలారి దేవ ప్రకాష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం నుంచి సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఏచూరి సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. నిత్య అధ్యయనశీలిగా, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడారని పేర్కొన్నారు. దేశంలో ప్రజా సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీతారాం ఏచూరి లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ప్రజలను చైతన్యపరిచి ఉధృతమైన ప్రజా పోరాటాలను నిర్మించడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వజ్జ రామారావు, మక్కా సీతారాములు, కరపటి సీతారామయ్య, కరపటి లక్ష్మయ్య, ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆధర్ల వినయ్ కుమార్, పాయం వరలక్ష్మి, సీఐటీయూ నాయకులు ఆరెల్లి శ్రీరాములు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, సంపత్, సైదులు, బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
25 Sep 2026 19:21:17
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
