- District News
- Khammam
- మసీదులు.. కబురస్థాన్లకు నిధుల పోరాటం!
మసీదులు.. కబురస్థాన్లకు నిధుల పోరాటం!
రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు హనీఫ్ వినతి
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ :
వైరా నియోజకవర్గ పరిధిలోని ముస్లిం, మైనార్టీల మసీదులు, కబురస్థాన్లకు ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టేందుకు సుమారు రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని సింగరేణి మండల మాజీ కోఆప్షన్ సభ్యులు హనీఫ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. వైరా, కొనిజర్ల, సింగరేణి మండలాలతో పాటు వైరా మున్సిపాలిటీ, ఏన్కూర్ ప్రాంతాల్లోని మసీదులు, కబురస్థాన్లకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హనీఫ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మైనార్టీ వర్గాల ఆధ్యాత్మిక ప్రదేశాలు, కబురస్థానాలకు రక్షణ కల్పించేలా ప్రహరీ గోడల నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు హనీఫ్ తెలిపారు. ఎమ్మెల్యే సానుకూల స్పందనపై నియోజకవర్గ పరిధిలోని ముస్లిం, మైనార్టీ సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
