- District News
- Nalgonda
- పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలి
వై ఆర్ పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ తనయుడు ఎలిశాల హేమచంద్ర.
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్ .
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పాటు పడేలా మట్టి గణపతులనే పూజించాలని వై ఆర్ పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ తనయుడు ఎలిశాల హేమచంద్ర పిలుపునిచ్చారు. వై ఆర్ పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ని పలు ప్రధాన కూడళ్లలో నిర్వహించిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఆయన ప్రారంభించి మాట్లాడారు పౌరునిగా పర్యావరణ ప్రేమికుడిగా తన వంతు బాధ్యతగా గత 9 సంవత్సరాల నుంచి నల్గొండ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పర్యాయం 12 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఎలిశాల హేమచంద్ వెల్లడించారు. నీటిలో కరగకపోవడం కరిగినా జీవరాశులకు నష్టం వాటిలల్లే పీ ఓ పీ లతో తయారైన విగ్రహాలకు బదులు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని ఆయన సూచించారు. ప్రకృతిని.. పర్యావరణాన్ని కాపాడకపోతే ఆ విపత్తు కు ప్రపంచం మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణను ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ప్రభుత్వం కూడా వివిధ వేదికల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నదని పౌరులుగా మన కర్తవ్యాన్నిమన చుట్టూ ఉండే పరిసరాలను వ్యర్ధమయం చేసుకోకుండా చూడాలన్నారు. ఈ విషయంలో వైఆర్ పీ ఫౌండేషన్ సామాజిక బాధ్యత తో వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుందని రవిప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో భరత్, అభినవ్ రెడ్డి, వై ఆర్ పి ఫౌండేషన్ ఆర్గనైజర్ యామ దయాకర్ , 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవిత, బోమ్మపాల గిరిబాబు , వెంకట్, శివ ,గణేష్ సురేష్, శివ, సంతోష్, విజయ్, మిర్యాల శ్రీను , ప్రవీణ్, కర్నాటి లక్ష్మీ జీనుగు జ్యోతి, రజిత, కుమారి, నవనీతా, విజయ పలువురు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
25 Sep 2026 19:21:17
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
