- District News
- Khammam
- టోనీ చొరవతో డ్రైనేజీకి మోక్షం!
టోనీ చొరవతో డ్రైనేజీకి మోక్షం!
రూ.3 లక్షల ఎంపీ నిధులతో సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణం.. ప్రారంభించిన సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ)
సింగరేణి, సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్ న్యూస్):
సింగరేణి మండల కేంద్రంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు స్థానిక సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ) చొరవ తీసుకున్నారు. ఎంపీ నిధులు రూ.3 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైనేజీ కాలువను శనివారం సర్పంచ్ టోనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ టోనీ మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ కాలువ నిర్మాణంతో వర్షపు నీరు, మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడి స్థానికులకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి దశలవారీగా చేపడతామని టోనీ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు తోటకూరి రాంబాబు, ఇమ్మడి తిరుపతిరావు, యాకూబ్, పెద్దమ్మ భాగ్యలక్ష్మి, తాజుద్దీన్, తొగర శ్రీను, విజయ్, అదేర్ల అంజయ్య, కాంట్రాక్టర్ గుగులోత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
