- District News
- Ranga Reddy
- గణనాథుడి లడ్డూకు రికార్డు ధర!
గణనాథుడి లడ్డూకు రికార్డు ధర!
రూ.2.30 లక్షలకు దక్కించుకున్న అనూష–శరత్‌రెడ్డి దంపతులు..
వరుసగా మూడోసారి సొంతం
Published On
By Ram Reddy
ఆమనగల్లు పట్టణంలోని పోస్టాఫీస్ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం ఉత్కంఠభరితంగా సాగింది. గణనాథుడి లడ్డూ రూ.2 లక్షల 30 వేల రికార్డు ధర పలకడంతో వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పట్టణానికి చెందిన కౌకుంట్ల అనూష–శరత్‌రెడ్డి దంపతులు రూ.2.30 లక్షలకు గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. దీంతో వరుసగా మూడోసారి గణేష్ లడ్డూను సొంతం చేసుకున్న ఘనతను వారు దక్కించుకున్నారు.
అదేవిధంగా విఘ్నేశ్వరుని ధనలక్ష్మి మాల రూ.1.71 లక్షలకు మంచుకొండ శోభారాణి–చంద్రశేఖర్ దంపతులు, ఆపిల్ కలశం రూ.70 వేలకు సారంగా అర్చన–శివకుమార్ దంపతులు వేలంలో దక్కించుకున్నారు. వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బజరంగ్ యూత్ సభ్యులు మంచుకొండ చంద్రశేఖర్, బాలస్వామి, మాకం సాయిబాబు, గుత్తి శేఖర్, శరత్‌రెడ్డి, గోరటి గిరి, చంద్రమౌళిగౌడ్, చందునాయక్, శంకర్, హరీష్, శేఖర్, రాహుల్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
06 Oct 2026 22:01:14
నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని
