గురువుల సేవలు అమూల్యం

Published On
గురువుల సేవలు అమూల్యం

 

 ఖమ్మం జిల్లా ప్రతినిధి వైరా సెప్టెంబర్ 05: లోకల్ గైడ్:

వాణి వివేకానంద విద్యాలయంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్‌ చుండూరు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ వాణి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను నేర్పుతూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు గురువులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులపై విద్యార్థుల దాడులు ఆందోళనకరమని, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

అనంతరం నిర్వహించిన విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కన్వీనర్‌ గింజుపల్లి జనార్ధన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._ _షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
  ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్  _ఏటూరునాగారం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్‌ ఐటీఐ వెనుక నివాసం ఉంటున్న ఇర్పా సుజాత–నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం