- District News
- Khammam
- ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీతో, పారదర్శకంగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్* *ఎస్ఐఆర్
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీతో, పారదర్శకంగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్* *ఎస్ఐఆర్ లో భాగంగా నోటీసుల జారీ, ధ్రువపత్రాల పరిశీలన వరకు పక్కాగా చర్యలు చేపట్టాలి.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధృవపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలి. వి.వెంకటాయపాలెం గ్రామంలో ఎస్ఐఆర్ లో భాగంగా
ఖమ్మం, ఆగస్టు- 20: లోకల్ గైడ్:
గురువారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని వి. వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్ల పరిష్కార ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. నోటీసుల జారీకి సంబంధించిన రికార్డులను, ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న ధృవపత్రాలను పరిశీలించి, ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ*, ఎస్‌ఐఆర్‌లో ఓటర్ల మ్యాపింగ్, మ్యాపింగ్ కాని ఓటర్ల గుర్తింపు, ఓటరు వివరాల్లో వ్యత్యాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం నో మ్యాపింగ్, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని సూచించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువు సమయంలో హాజరై తమ పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధృవపత్రాలను నిబంధనల మేరకు పరిగణనలోకి తీసుకుని, ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు, అక్టోబర్ 15 వరకు నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, నిర్ణీత గడువులో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన ధృవపత్రాలతో నిర్ణీత తేదీ, సమయంలో హాజరయ్యేలా బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయాన్ని అందించాలని తెలిపారు.
గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ధ్రువపత్రాల స్వీకరణకు తేదీ, సమయాలను ముందుగానే ఖరారు చేసి, ఓటర్లకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్‌లో గుర్తించిన అనామలీస్ కేసులు, మ్యాపింగ్ కాని కేసులకు సంబంధించి బీఎల్‌ఓల ద్వారా నోటీసు ప్రతిని తప్పనిసరిగా అందజేయాలని చెప్పారు. నోటీసు అందుకున్న ఓటరు నుంచి స్వీకరణ ధ్రువీకరణ తీసుకుని, సంబంధిత రికార్డుల్లో భద్రపరచాలని ఆదేశించారు.
నోటీసుల జారీ, ధ్రువపత్రాల స్వీకరణ, పరిశీలన, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రతి దశను అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయాన్ని అందిస్తూ, ప్రతి కేసును నిబంధనల ప్రకారం పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రఘునాథపాలెం తహసీల్దారు శ్వేత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ అన్సారి, వి.వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్ కాపా ఆదినారాయణ, బీఎల్‌ఓలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.
