- District News
- ఎక్లాస్‌పూర్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
ఎక్లాస్‌పూర్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
విద్యార్థి మృతి అత్యం త దురదృష్టకరం.
నారాయణపేట ఆగస్టు 7:
నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ మం డల పరిషత్ ప్రాథమికోన్న త పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక సందర్శించారు. ఈ నెల 6వ తేదీన ఆ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి రంజిత్ పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందిన దురదృ ష్టకర ఘటన నేపథ్యంలో కలెక్టర్ పాఠశాలను సంద ర్శించి, విద్యార్థి పాముకా టుకు గురైన తరగతి గది, కిటికీలు, పాఠశాల పరిస రాలను ప్రత్యక్షంగా పరిశీ లించారు.ఈ సందర్భంగా విద్యార్థి మృతి పట్ల కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబా నికి ప్రభుత్వం అన్ని విధా లా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మన జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి ప్రభుత్వం అవసర మైన మౌలిక వసతులు, విద్యా సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. అయినప్పటికీ ఎక్లాస్‌పూర్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన అత్యంత బాధాక రమని విచారం వ్యక్తం చేశా రు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపడతామ ని స్పష్టం చేశారు. పాఠశా లను సమగ్రంగా పరిశీలిం చి, అవసరమైన మరమ్మ తులు, అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఇంజినీ రింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పాఠ శాల వెనుక భాగంలో ఉన్న పొదలు, చెట్లు, కొండ ప్రాంతాలను పూర్తిగా శుభ్ర పరిచి, విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రత్యేక ఆర్థిక సహా యం అందేలా ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు పంపించామని, అర్హత మేర కు త్వరితగతిన సహాయం అందించేలా చర్యలు తీసు కుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.అదేవిధంగా స్థాని క ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌తో సమన్వయం చేసుకొని పాఠశాలలో టాయిలెట్లు, బాత్ రూము లు, భద్రతా గోడలు, ఇతర మౌలిక వసతుల అభివృ ద్ధికి అవసరమైన పరిపా లనా అనుమతులను తక్ష ణమే మంజూరు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు.విద్యార్థుల భద్ర తే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న కలె క్టర్, జిల్లాలోని అన్ని ప్రభు త్వ పాఠశాలలను సమ గ్రంగా సమీక్షించి, అవసర మైన చోట మరమ్మతులు, అభివృద్ధి పనులను వెంట నే చేపట్టి, ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుం టామని ఆమె వెల్లడించా రు.
ఫోటో రైట్ అప్:9.తరగతి గది నీ పరిశీలించిన కలెక్టర్
-------------------------------------
