ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ

Published On
ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ

 

లోకల్ గైడ్, ధారూర్  వికారాబాద్ జిల్లా బ్యూరో (అక్టోబర్ 13 ): 

వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ)గా సురేష్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు ఇక్కడ ఎస్‌ఐగా విధులు నిర్వహించిన రాఘవేందర్ బదిలీ కాగా, ఆయన స్థానంలో సురేష్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అక్రమ రవాణా, గంజాయి అమ్మకాలు, జూదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీస్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని, ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, విలేకరులు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
అనంతరం బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్‌ఐ సురేష్‌ను పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక నాయకులు, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ఏఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన.. హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..
        లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి / కొడంగల్: హకీంపేట్‌లో త్వరలో జరగనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్‌లో
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక
ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం