- District News
- Khammam
- గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక
గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక
పరిశీలన: తహశీల్దార్ పి. కరుణాకర్ రెడ్డి...
తల్లాడ: లోకల్ గైడ్:
మండల పరిధిలోని కొత్త వెంకటగిరి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ పి. కరుణాకర్ రెడ్డి గ్రామ సందర్శన చేసి, పోలింగ్ కేంద్రం పరిధిలోని రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, అలాగే జాబితాలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను నిరంతరం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సమీక్షలో స్థానిక బీఎల్ఓ (BLO) మాధవి పాల్గొని, గ్రామంలో నమోదైన కొత్త ఓటర్ల వివరాలు, తొలగింపులు మరియు ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించిన నివేదికలను తహశీల్దార్‌కు సమర్పించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, పారదర్శకంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని బీఎల్ఓకు తహశీల్దార్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ సర్పంచ్ రుద్రాక్ష రామకృష్ణ చారి,గ్రామ రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
