- District News
- "కోట్ల మణిపూసలు"
"కోట్ల మణిపూసలు"
లోకల్ గైడ్ షాద్నగర్
(1)
"సత్సాంగత్య బలము
ఉత్తమ జన్మ ఫలము
శివ నామ స్మరణంబే!
పునర్జన్మ రహితము"!
(2)
"మానవ సంబందాలె
మేలిమైన ముత్యాలె
జారి కింద పడిపోతే!
వంగి తీసు కోవాలె"!
(3)
"మాట నేర్పిన అమ్మకు
నడక నేర్పిన నాన్నకు
జేజేలు పలుక వలెను
తోడు నిలిచిన భార్యకు"!
(4)
"దెబ్బ తగిలితె ఓర్చుకో
తప్పు జరిగతె నేర్చుకో
జాగ్రత్తగ మసలు కుంటు
మాట తీరు మార్చుకో"!
(5)
"మమకారం తోడు నిచ్చు
అహం మనకు కీడు తెచ్చు
ధర్మ బుద్ది, క్రమశిక్షణ
గలవారినె జనులు మెచ్చు"
(6)
"విద్య వలన వినయము
తత్ఫలితమె యోగము
ధర్మార్థము కలగలిసి
బ్రతుకు వెలుగు దీపము"!
(7)
"దివ్య శక్తి సూర్యునిలో
ఆత్మ శక్తి మనసులలో
దైవత్వమె గోచరించు
ఆధ్యాత్మిక చింతనలో"!
(8)
"పిల్లి శాప నార్థాలకు
ఉట్లేమో! తెగి పడుటకు
పొంత నసలె లేనె లేదు
నిజమైన జీవితాలకు"!
దయానందం కోట్ల 🙏
రిటైర్డ్ టీచర్, షాద్ నగర్
99484 33922
