యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి: కేటీఆర్

టైమ్స్ బిజినెస్ అవార్డ్స్

Published On
యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి: కేటీఆర్



కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 27 (లోకల్ గైడ్ ప్రతినిధి)

2026లో ప్రముఖుల సందేశం
హైదరాబాద్: వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను సత్కరించే టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ హైదరాబాద్ 2026 – 12వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం నగరంలోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. పరిశ్రమలు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్ ఎస్టేట్, తయారీ, సేవారంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీనటుడు నాగ చైతన్య, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం నేటి ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమన్నారు. యువత ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించేవారిగా ఎదగడానికి స్టార్టప్‌లు దోహదపడతాయని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో ఎంఎస్ఎంఈలు కీలకమని, దేశ జీడీపీ, ఎగుమతుల్లో వాటి పాత్ర గణనీయంగా ఉందన్నారు. యువ పారిశ్రామికవేత్తలు సరికొత్త ఆలోచనలు, సాంకేతికతతో మార్కెట్లోకి రావాలని సూచించారు. మెరుగైన సమాజ నిర్మాణానికి వ్యాపార రంగంలో ఆవిష్కరణలు అవసరమని సినీనటుడు నాగ చైతన్య అన్నారు. కేవలం లాభాలకే పరిమితం కాకుండా సమాజం, పర్యావరణానికి మేలు చేసే వ్యాపారాలే భవిష్యత్తులో ప్రాధాన్యం పొందుతాయని పేర్కొన్నారు. తాను రెండేళ్లుగా పారిశ్రామికవేత్తగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని, కొత్త ఆలోచన లేదా ఉత్పత్తిని విజయవంతంగా మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు ఇన్నోవేషన్ కీలకమని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రోత్సహించడమే అవార్డుల ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు, వైద్యులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి