తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 

Published On
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 

 

రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ):

క్రీడాలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉడంగడ్డ మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ లో 12వ స్వర్గీయ సమ్‌రెడ్డి సుదర్శన్ రెడ్డి మెమోరియల్ తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 ముగింపు వేడుకల్లో  అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలను అందజేసి అభినందించారు. ముఖ్యంగా మెన్స్ విభాగంలో ప్రథమ స్థానంలో విజయం సాధించిన స్వర్ణ నాయుడు ప్రైజ్ మనీ బహుమతిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షురాలు కే. కే . మహేశ్వరి,  జనరల్ సెక్రటరీ పి.నాగేందర్ రెడ్డి  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏ ఎల్ నరేష్ రెడ్డి,  ధనంజయ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని అభిప్రాయపడ్డారు. 
అదేవిధంగా మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఇంతటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన రంగారెడ్డి టేబుల్ టెన్నిస్ అసోసి  సురేందర్ రెడ్డి కి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విజేతలతో పాటు క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడా సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు.  ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
            రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):   దేశంలో ఓట్ల తొలగింపు వ్యవహారం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ పార్టీ నాయకులు
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్
మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
నర్సంపేట మండలంలో పైపులైన్ లీకేజీతో మిషన్ భగీరథ వృథాగా పోతున్న నీరు
రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్త్య మహిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామస్తుల ఆరోపణ