సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్

బండి నాగేశ్వరరావు, డాక్టర్ మారుతి బాబు గౌడ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక

Published On
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్

 

కారేపల్లి, నవంబర్ 1 (లోకల్ గైడ్ న్యూస్): సింగరేణి మండల గౌడ సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మండల మోకు దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా మోకు దెబ్బ అధ్యక్షుడు బండి నాగేశ్వరరావు, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మారుతి బాబు గౌడ్ నాయకత్వం వహించారు. గౌడ సంఘం అభివృద్ధి, ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్, ఉపాధ్యక్షుడిగా గౌని అర్జున్ గౌడ్, కార్యదర్శిగా గడ్డం వెంకట్ గౌడ్, కోశాధికారిగా తోడేటి రమేష్ గౌడ్, జనరల్ సెక్రటరీగా బండి వెంకట్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గౌడ సంఘం సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గౌడ కులస్తుల ఐక్యతను పెంపొందించడం, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయడం, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ముందుకు సాగడం నూతన కమిటీ బాధ్యత అని పేర్కొన్నారు. నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా గౌడ సంఘం సభ్యుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, గౌడ సంఘం సభ్యులు, సీనియర్ నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్ ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
    లోకల్ గైడ్, మోమిన్ పేట్ వికారాబాద్ జిల్లా : మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ మరియు
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్
మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
నర్సంపేట మండలంలో పైపులైన్ లీకేజీతో మిషన్ భగీరథ వృథాగా పోతున్న నీరు