నాయకుడి గెలుపే మొక్కు.. గెలుపు తర్వాత మొక్కే తీర్చిన వీరాభిమాని!

మాలోత్ రాందాస్ నాయక్ విజయాన్ని కోరుతూ సమ్మక్క–సారలమ్మకు మొక్కులు.. ఘనంగా పూజలు నిర్వహించిన డీసీసీ జిల్లా కార్యదర్శి ఆర్‌కే నాయుడు

Published On
నాయకుడి గెలుపే మొక్కు.. గెలుపు తర్వాత మొక్కే తీర్చిన వీరాభిమాని!

 

 

జూలూరుపాడు, సెప్టెంబర్ 3, లోకల్ గైడ్ న్యూస్:

అభిమాన నాయకుడి విజయమే లక్ష్యంగా మొక్కుకున్న ఓ వీరాభిమాని.. తన కోరిక నెరవేరడంతో అమ్మవార్లకు మొక్కు తీర్చుకున్నారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ విజయాన్ని కోరుతూ జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ కార్యదర్శి గోపు రామకృష్ణ (ఆర్‌కే నాయుడు) గురువారం కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా మొక్కులు చెల్లించారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆర్‌కే నాయుడు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను మొక్కుకున్నారు. తన అభిమాన నాయకుడికి విజయం దక్కిన అనంతరం అమ్మవార్లకు మొక్కు చెల్లించాలని నిర్ణయించుకున్న ఆయన.. సమయం అనుకూలించక కొంతకాలం వేచి చూసి, గురువారం పడమటి నర్సాపురంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. తన అభిమాన నాయకుడిపై తనకున్న అభిమానం, విశ్వాసం, నిబద్ధతను ఈ కార్యక్రమం ద్వారా ఆర్‌కే నాయుడు చాటుకున్నారు. ఆయన మొక్కు చెల్లింపు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, ఓబీసీ జిల్లా చైర్మన్ అల్లాడి నరసింహారావు, జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రావు, వేల్పుల నరసింహారావు, గోపాల్ రెడ్డి, సుమంత్, బొడ్డు మల్లికార్జున్, గోసు రామారావు, హరీష్, లేగల మల్లికార్జున్, సాయికుమార్ తదితర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్ గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్
    కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.