నిజాం చెరువు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలన ఎమ్మెల్యే మురళి నాయక్ , చైర్మన్ జ్యోతి రమేష్ నాయక్

Published On
నిజాం చెరువు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలన ఎమ్మెల్యే మురళి నాయక్ , చైర్మన్ జ్యోతి రమేష్ నాయక్

IMG-20260921-WA0146 లోకల్ గైడ్ సెప్టెంబర్ 21 మహబూబాబాద్ 

 మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గణేశుని నిమజ్జనాల సందర్భంగా నిజాం చెరువును సంబంధిత పోలీస్ శాఖ అధికారులతో మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించిన  మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ వారితోపాటు మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్  పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే.  చైర్మన్ , మాట్లాడుతూ  నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పారిశుధ్యం, విద్యుత్, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చైర్మన్  గుగులోతు జ్యోతి రమేష్ నాయక్ మాట్లాడుతూ *మానుకోట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మురళి నాయక్ ఆశీస్సులతో* వారి యొక్క సహకారంతో ఈ యొక్క పట్టణ కేంద్రాన్ని ఈ నిజాం చెరువు వద్ద ఉన్న సమస్యలను, నిమజ్జన సమయంలో ఎదురయ్యే ఆటంకాలను పరిష్కరించి, చెరువును మరింత అభివృద్ధి చేసి పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని , చైర్మన్ జ్యోతి రమేష్ నాయక్ తెలిపారు.
ఎమ్మెల్యే మురళి నాయక్ బతుకమ్మ పండుగ సమయములో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్నేరు వాగు వద్ద బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, త్వరలోనే పనులను ప్రారంభించి ఎమ్మెల్యే మురళి నాయక్ ఆశీస్సులతో పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వారు తెలిపారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, భక్తులకు మరియు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
...ఈ యొక్క కార్యక్రమంలో వైస్ చైర్మన్ సువర్ణపు సోమయ్య, మున్సిపల్ కమిషనర్, వినోద్ కుమార్,DSP తిరుపతి రెడ్డి,CI అంజలి, De ఉపేందర్,AE కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ, పాలు వార్డుల కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు, బొల్లు రాజు, పద్మ ప్రవీణ్, మహమ్మద్ ఖలీల్, సాల్వాయి దిలీప్, కాటా భాస్కర్, బానోత్ భాస్కర్, బద్దెపూరి గోపీనాథ్, నిమ్మల శ్రీను, జిల్లా నాయకులు ఎడ్ల రమేష్, సతీష్ రావు, రెడ్డియాల శీను,మున్సిపల్ శాఖ సిబ్బంది పోలీస్ శాఖ సిబ్బంది, పట్టణ నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు,మండల అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస్, పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం