- District News
- Nalgonda
- ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్ లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్ .
ఆటో జీపు కారు లారీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల కు భవన నిర్మాణ కార్మికుల తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ రోడ్ లో ట్రాలీ ఆటో డ్రైవర్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) దేవరకొండ రోడ్డు అడ్డా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ దేవరకొండ రోడ్డులో గల సిమెంటు, ఐరన్,బండలు, సామిల్, వివిధ కిరాణా షాపుల దగ్గర సరుకుల రవాణా వినియోగదారులకు అందిస్తూ ట్రాలీ ఆటో కార్మికులు జీవనం గడుపుకుంటున్నారని అన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంచుకోవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. యూనియన్ గా సంఘటితమై చార్జీలు పెంచుకోవడం జరిగిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల తరహాలో ట్రాన్స్పోర్ట్ కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు.అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న సంక్షేమ బోర్డు జాడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆన్లైన్ ఏజెన్సీలు ద్వారా సరుకుల రవాణా పెరగడంతో కూలి గిట్టుబాటు గాక కుటుంబాలు గడవని దుర్భర పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ పట్టణంలో అద్దె ఇండ్లలో నివాసం ఉంటున్న ట్రాలీ ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ టవర్స్ లలో ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు . అనంతరం కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, అధ్యక్షులు జడల సోములు, ఉపాధ్యక్షులు గంగనబోయిన నరసింహ, కార్యదర్శి ఈర్ల శ్రీశైలం సహాయ కార్యదర్శి పగిళ్ల చెన్నయ్య, కోశాధికారి ఈసం హుస్సేన్ లను ఎన్నుకోవడం జరిగింది .ఈ సమావేశంలో శ్రీనివాస్ మహేందర్ అశోక్ నరసింహ మారయ్య లక్ష్మయ్య రవి యాదయ్య వెంకన్న క్రాంతి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
