- District News
- సీనియర్ జర్నలిస్టు సాదుల సుగుణాకర్‌కు సన్మానం
సీనియర్ జర్నలిస్టు సాదుల సుగుణాకర్‌కు సన్మానం
పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 20 (లోకల్ గైడ్)
నాలుగు దశాబ్దాలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ దినపత్రికల్లో పాత్రికేయుడిగా సేవలందిస్తూ ప్రజా సమస్యలను తన కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్టు సాదుల సుగుణాకర్ పెద్దపల్లి ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్‌గా నియమితులైన సందర్భంగా అంతటి అన్నయ్యగౌడ్, పుష్పలత దంపతులు ఘనంగా సన్మానించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అనేక ప్రత్యేక కథనాలు రాశారని వారు కొనియాడారు. పాత్రికేయ రంగంతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సుగుణాకర్ తనవంతు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. పెద్దపల్లి స్టాఫ్ రిపోర్టర్‌గా మరింత బాధ్యతతో ప్రజల పక్షాన పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అంతటి అన్నయ్యగౌడ్, పుష్పలత దంపతులు
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, పెద్దపల్లి
