విద్యార్థుల సంక్షేమానికి దాతల చేయూత

విద్యార్థులకు యూనిఫాంలు, క్రీడా దుస్తులు, స్నాక్స్ పంపిణీ.. సేవలను అభినందించిన మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు

Published On
విద్యార్థుల సంక్షేమానికి దాతల చేయూత

 



కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 16 (లోకల్ గైడ్ న్యూస్) : మండలంలోని పొలంపల్లి గేట్ తండా ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత యూనిఫాంలు, షూస్, స్నాక్స్‌తో పాటు క్రీడా దుస్తులు, ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.IMG-20260916-WA0105 పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించేందుకు దాతలు ముందుకు రావడంతో పాఠశాలలో సేవా స్ఫూర్తి వెల్లివిరిసింది. చంద్రు ఫౌండేషన్ తరఫున ముఖ్య కార్యనిర్వహణ అధికారి భూక్యా వీరన్న సుమారు రూ.7 వేల విలువైన క్రీడా దుస్తులను విద్యార్థులకు అందజేశారు. ఈ క్రీడా దుస్తులను మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు, షూస్, స్నాక్స్ అందించారు. పాఠశాలకు దాతలు విద్యార్థుల సౌకర్యార్థం కుర్చీలతో కూడిన బల్లలను అందజేశారు. మాజీ సర్పంచ్ ధారావత్ భద్రు నాయక్, రాజకుమార్ కలిసి రూ.15 వేల విలువైన ఫర్నిచర్‌ను పాఠశాలకు అందించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో దాతలు చూపుతున్న చొరవ పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను గుర్తించి చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు క్రీడా దుస్తులు, పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రు ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల చదువు, క్రీడలు, సౌకర్యాల కోసం దాతలు ముందుకు రావడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, పొలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ హేమలత బాలాజీ, మాజీ సర్పంచ్ ధారావత్ భద్రు నాయక్, చంద్రు ఫౌండేషన్ ప్రతినిధులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
            పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్)సుల్తానాబాద్ పట్టణంలోనీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చాతరాజు రమేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ
ఉపాధి హామీపై సింగరేణి సర్పంచుల కసరత్తు
సూధనపల్లి పాఠశాలలో ఉచిత షూ, బెల్ట్ ల పంపిణి ..
మూసీ పునరుజ్జీవనం: ఒడ్డున వెలుగులు కాదు.. నదిలో స్వచ్ఛమైన నీరే నిజమైన ప్రగతి
అంబులెన్స్‌కూ అందని ఏజెన్సీ!
గురవయ్య కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరామర్శ
టోనీ చొరవతో డ్రైనేజీకి మోక్షం!