- District News
- కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
రేవంతన్న ప్రభుత్వంలో మెరుగైన విద్యావ్యవస్థ పెద్దపల్లి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
Published On
By Ram Reddy
పెద్దపల్లి
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షుణంగా వివరించారని తెలిపారు. విద్యను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ముందు ఆలోచనతోని ఉందని అలాగే ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ప్రభుత్వం ప్రారంభించి 1600 విద్యార్థులతోని ఆ పాఠశాల నడుస్తోందని అలాగే రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య ప్రమాణాలను పెంచడమే కాకుండా విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం పనులుప్రారంభించుకోవడం జరిగిందని పిల్లర్లు వరకు కూడా నిర్మాణం పూర్తి కావడం జరిగిందని సంవత్సర కాలంలో పాఠశాలను పూర్తిచేసుకుని బీసీ ఎస్సీ,మైనారిటీ,ఎస్టి హాస్టల్స్ విద్యార్థులను ఒకే దగ్గరికి చేర్చి ఒకే దగ్గర చదువుకునే విధంగా, ఎలాంటి కుల మత బేధాలు లేకుండా విద్య విషయంలో అందరూ సమానులే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పొందే పేద విద్యార్థుల ఆకలి బాధలు తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమని వారికి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్,వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు మరియు పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, పలువురుప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
15 Sep 2026 19:48:59
కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి)
హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
