ప్రముఖ సీనియర్ నటి షావుకారి జానకి  మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం.

Published On
ప్రముఖ సీనియర్ నటి షావుకారి జానకి  మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రకటిది .లోకల్ గైడ్.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటి, పద్మశ్రీ షావుకారి జానకి  మృతి పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 
"షావుకారి జానకి  తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి, తన సహజసిద్ధమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కథానాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ చిరస్మరణీయం. 'షావుకారి' చిత్రంతో ప్రారంభమైన ఆమె నట ప్రస్థానం భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం" అని కొనియాడారు.ఆమె మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా మొత్తం భారతీయ సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. షావుకారి జానకి  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,