- District News
- Ranga Reddy
- తలకొండపల్లి లో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్ సహకారం
తలకొండపల్లి లో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్ సహకారం
లోకల్ గైడ్ ఆమనగల్లు
, ఆగస్టు 13: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)లో భాగంగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్ చురుకుగా పాల్గొని ప్రజలకు సహకారం అందించారు. ఓటర్ల గుర్తింపు, ఎన్‌యుమరేషన్ ఫారాల నింపడం, సందేహాల నివృత్తి తదితర అంశాల్లో బూత్ స్థాయి అధికారులతో కలిసి ఆయన సేవలందించారు.
తలకొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 88 శాతం మంది ఓటర్లను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ సహాయ కేంద్రంలో పెరుమాండ్ల సురేష్ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ముఖ్యంగా 18వ, 21వ పోలింగ్ బూత్‌లతో పాటు మరికొన్ని బూత్‌లలో బూత్ స్థాయి అధికారులకు సహకరిస్తూ ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని అందించారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సురేష్ పేర్కొన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచన మేరకు జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు ప్రతిష్టాత్మకంగా కొనసాగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తలకొండపల్లి ప్రజలకు సహకరించడం తన బాధ్యతగా భావించానని పెరుమాండ్ల సురేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన బూత్ స్థాయి అధికారుల సేవలను ఆయన అభినందించారు. ప్రజలు అందించిన సహకారంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొన్నారు.
