ప్రశ్నించి పోరాడే జెఎసి కూటమి గెలిపిద్దాం.

అద్దె యూనియన్ల మాయలో పడొద్దు.  కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి

ఆర్టీసీ కార్మికుల పక్షాన శాసనమండలి లో గళం విప్పుతా.    గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచారంలో ఎం.ఎల్.సి. నెల్లికంటి సత్యం.
Published On
ప్రశ్నించి పోరాడే జెఎసి కూటమి గెలిపిద్దాం.

 
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.

 

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్న గుర్తింపు సంఘము ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి బస్ గుర్తు, నిచ్చెన గుర్తు పై ఓటు వేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై నిరంతరం ప్రశ్నించే, పోరాడే సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.నల్లగొండలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధమాస్ రెడ్డి లతో కలసి ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచారం ఆదివారం నల్లగొండ ఆర్ టి సి డిపోలో నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు.ఆర్టీసీలో 2016 తర్వాత ఇప్పటివరకు గుర్తింపు సంఘ ఎన్నికలు జరగలేదని, దాదాపు దశాబ్దం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని  అన్నారు.ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ముందుకు సాగుతున్న నేపథ్యంలో గుర్తింపు పొందే యూనియన్‌పై పెద్ద బాధ్యత ఉంటుందని తెలిపారు.ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ప్రక్రియలో కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని  అన్నారు. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌, ఆర్టీసీ నిబంధనలు, రెగ్యులేషన్లను సమగ్రంగా పరిశీలించి కార్మికుల ప్రయోజనాలను కాపాడే యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని సూచించారు.
విలీనం అంశంపై కొందరు యూనియన్‌ నాయకులు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎవరు నిజంగా కార్మికుల కోసం పోరాడారు.ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారు.అనేది కార్మికులు గత చరిత్రను పరిశీలించి నిర్ణయించుకోవాలని కోరారు.ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ హక్కులు, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలని  కోరారు.కార్మికుల సమస్యలను చట్టసభలో కూడా బలంగా వినిపిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా బస్సు, నిచ్చేన గుర్తులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు.ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాబు టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధమాస్ రెడ్డి లు మాట్లాడుతూ
2019 తర్వాత ఆర్టీసీలో యూనియన్లు లేకపోయినా కార్మికుల సమస్యలపై తమ పోరాటం కొనసాగిందని సత్యం పేర్కొన్నారు.ధర్నాలు, గేట్‌ మీటింగ్‌లు, నిరాహార దీక్షలు, నిరసనలు, ఛలో హైదరాబాద్‌, ఛలో ఇందిరాపార్క్‌, ఛలో బస్‌భవన్‌, అసెంబ్లీ ముట్టడి వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ .యు, టి ఎం. యు, ఎన్.ఎం .యు, తో పాటు ఇతర యూనియన్లతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్లామని గుర్తుచేశారు.కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, వేతనాలు, ప్రభుత్వంలో విలీనం వంటి కీలక అంశాలపై గుర్తింపు సంఘం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందని అందుకే జేఏసీ కూటమి గెలిపించుకుని హక్కులను సాధించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏఐటియూసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పల్లా దేవేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడింగ్ శ్రవణ్ కుమార్ పబ్బు వీరస్వామి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కేస్ రెడ్డి టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బోనగిరి నరేందర్, కూటమి నాయకులు జమాల్ గౌడ్ డీజే రావు బాసాని వెంకటయ్య, కే దయాకర్ ఎస్.కె గులాం రసూల్ ఎల్ స్వామి ఎన్ ఆర్ సి రాజు, లూర్దమ్మ బి శంకరమ్మ ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎండి జానీ, డి వెంకన్న, వి లెనిన్, శంకర్,తదితరులు ఉన్నారు

Tags:

About The Author

Latest News

బీఎస్పీ తోనే బహుజనులకు భవిష్యత్తు : రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ  బీఎస్పీ తోనే బహుజనులకు భవిష్యత్తు : రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ 
లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా, బ్యూరో ప్రతినిధి : బీఎస్పీ తోనే బహుజనుల జీవితాలకు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ అన్నారు. బీఎస్పీ...
కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం!
కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
వికారాబాద్‌లో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకై కలెక్టర్‌కు వినతిపత్రం:
ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి