వరంగల్ జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా దండెం సంపత్ నియమాకం

Published On
వరంగల్ జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా దండెం సంపత్ నియమాకం

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్20
(లోకల్ గైడ్ న్యూస్)

వరంగల్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా దండెం సంపత్ను నియమించారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ దండెం సంపత్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. మాజీ సర్పంచుల సంఘం కార్యదర్శి మెడెం సాగర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ( ఎస్ ఎఫ్ సి) నిధులను ప్రతి నెల విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తున్న సర్పంచులకు ప్రస్తుతం అందుతున్న గౌరవ వేతనాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఖర్చులు, సర్పంచుల బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని గౌరవ వేతనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని అన్నారు.వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నల్లబెల్లి మండలం నార్కపేట గ్రామపంచాయతీ‌   సర్పంచ్ దండెం సంపత్  మాట్లాడుతూ, జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సర్పంచుల హక్కులను కాపాడేందుకు తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ తరఫున ముందుండి పనిచేస్తానని, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్ మార్గదర్శకత్వంలో, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ నాయకత్వంలో సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేస్తానని దండెం సంపత్ సర్పంచ్ నార్కపేట వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News