- District News
- Ranga Reddy
- నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నం నిందితుడిపై కేసు నమోదు, పరారీలో నిందితుడు
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నం నిందితుడిపై కేసు నమోదు, పరారీలో నిందితుడు
Published On
By Ram Reddy
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు గ్రామానికి చెందిన బి. నరేందర్ అలియాస్ నాని (40) అనే వ్యక్తి సెప్టెంబరు 30న ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను సెల్‌ఫోన్ చూపిస్తానని ఆశచూపి లోపలికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. ఆ రోజు రాత్రి చిన్నారి తీవ్ర నొప్పితో బాధపడుతూ తల్లికి చెప్పగా, సాధారణ నొప్పేనని భావించి సరిపెట్టారు. మరుసటి రోజు నొప్పి తీవ్రతరం కావడంతో బాలిక విలపించగా తల్లిదండ్రులు పరిశీలించగా గాయాలు కనిపించాయి. ఆరా తీయగా జరిగిన ఘోరాన్ని చిన్నారి తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు డయల్-100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడి కోసం గాలింపు
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నరేందర్‌పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన వెలుగుచూసినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండటంతో, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు...ఈ అమానవీయ ఘటనపై గ్రామస్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారికి న్యాయం చేయాలని, పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Oct 2026 10:49:50
లోకల్ గైడ్ ఆమనగల్లు, అక్టోబర్ 2:
కేంద్ర ప్రభుత్వం ఓబీసీల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 4న శంషాబాద్‌లో నిర్వహించనున్న ఓబీసీ సింహగర్జన సభను విజయవంతం...
