- District News
- Nalgonda
- ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3.50 లక్షల ఎల్ ఓ సి పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం .
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3.50 లక్షల ఎల్ ఓ సి పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం .
Published On
By Ram Reddy
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బట్టు నరహరి కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.3,50,000/-ల ఆర్థిక సహాయ మంజూరు పత్రాన్ని (కాపీ) మంగళవారం వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని, ఆపద సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. .ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
15 Sep 2026 13:06:16
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు యు. రమేష్
