బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు

Published On
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి  . లోకల్ గైడ్ .

కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ వడ్డె ప్రభాకర్ , విద్యా కమిటీ చైర్మన్ కందుకూరి నాగయ్య , వస్కుల వెంకన్న , వడ్డె ఎల్లేశ్ , వడ్డె రాంబాబు , వడ్డె మాణిక్యం  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఆకర్షితులై పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

Tags:

About The Author

Latest News