విద్యార్థులపై శ్రద్ధ.. పాఠశాలపై బాధ్యత!

సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు చేతుల మీదుగా షూస్ పంపిణీ, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం

Published On
విద్యార్థులపై శ్రద్ధ.. పాఠశాలపై బాధ్యత!

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్): విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ భజ్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని బొక్కలతండా ఎంపీపీఎస్ పాఠశాలలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు చేతుల మీదుగా విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ విద్యార్థులకు స్వయంగా షూస్ అందజేసి, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలికIMG-20260915-WA0033IMG-20260915-WA0032 సదుపాయాలు అందుబాటులో ఉంటే వారు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై, ఉత్సాహంగా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలల్లో అవసరమైన సదుపాయాల కల్పనకు గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం సర్పంచ్ హనుమంతరావు పాఠశాల ఆవరణలో పూల మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చడంతో పాటు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటినట్లు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను విద్యార్థులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల చదువు, సంక్షేమంతో పాటు పాఠశాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విజయలక్ష్మి, మంగీలాల్, అంగన్వాడీ టీచర్ రజని, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News