ఘనంగా జర్నలిస్టు మధు గౌడ్ కూతురు అద్విక పుట్టినరోజు వేడుకలు

హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్,చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

చిన్నారి అద్వికను వెల్కమ్ చెప్తూ కళాకారుల ఆటపాటలు పెద్ద ఎత్తున హాజరైన నేతలు, అధికారులు,జర్నలిస్టులు
Published On
ఘనంగా జర్నలిస్టు మధు గౌడ్ కూతురు అద్విక పుట్టినరోజు వేడుకలు

IMG-20260831-WA0188కొత్తూరు ఆగస్టు 31 (లోకల్ గ్రైడ్)

కొత్తూరు సీనియర్ జర్నలిస్ట్ జవ్వాజి మధుసూదన్ గౌడ్ కుమార్తె అద్విక మొదటి పుట్టినరోజు వేడుకలను ఆదివారం ప్రిన్స్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్,చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కాజా పాషా,  మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ ఎంపీపీలు రవీందర్ యాదవ్,శివశంకర్ గౌడ్,మధుసూదన్ రెడ్డి,మాజీ జెడ్పిటిసిలు తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి దంపతులు,ఎమ్మె శ్రీలత సత్యనారాయణ,మాజీ కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్ హాజరై చిన్నారి అద్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు చిన్నారి అద్విక నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవించారు.అలాగే ప్రయోజకురాలై మధుసూదన్ గౌడ్ దంపతులకు మంచి పేరు తేవాలని ఆశీర్వాదాలు అందించారు.అయ్యప్ప టెంపుల్ సమీపంలోని ప్రిన్స్ ఫంక్షన్ హాల్ లో పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారిని వెల్కమ్ చెప్తూ కళాకారులు చేసిన నృత్యాలు అతిథులను అలరింప చేశాయి.ఈ వేడుకలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, మేకగూడ పిఎస్సిఎస్ చైర్మన్ అంబటి ప్రభాకర్,సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ,సర్పంచులు గబ్రు చౌహాన్,దయానంద్ గుప్తా,ఎర్రోళ్ల జగన్,బోకుల శ్రీరాములు,గొల్లపల్లి అశోక్, నరసింహారెడ్డి,లలిత గోపాల్ నాయక్,గోవింద్ నాయక్, నాయకులు మొర్ర క్రాంతి రెడ్డి, ఇందూరి శ్రీనివాస్,వైస్ చైర్మన్ డోలి రవీందర్,యువ నాయకుడు నవీన్ చారి,కడల శ్రీశైలం,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నల్గొండ  నెగ్జా షోరూమ్ లో సరికొత్త బాలెనో ఘన ఆవిష్కరణ. నల్గొండ  నెగ్జా షోరూమ్ లో సరికొత్త బాలెనో ఘన ఆవిష్కరణ.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్ .  నల్గొండలోని  నెగ్జా (పవన్ మోటార్స్) షోరూమ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ది స్టన్నింగ్ న్యూ
సోమనాథ క్షేత్రంలో శాంతి సమత్వ దినోత్సవ వేడుకలు
_గురువులకు ఘన సన్మానం.. కళలకు పెద్దపీట
శంషాబాద్ లో ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయాలనిమంత్రి శ్రీధర్ బాబుకి  వినతి పత్రం
సాంకేతిక పరిజ్ఞానంతో భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్
శ్రీశైలంలో సమృద్ధిగా నీళ్లు .
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై ఆరా