- District News
- నీళ్లపై నిరంజన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి.
నీళ్లపై నిరంజన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి.
ఆగస్టు 1నుంచే మోటర్లు నడుస్తున్నాయి. --- వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి..
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 8:
వ్యవసాయ రంగానికి సాగునీటి విడుదలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక లిఖిత పూర్వక ప్రకటన విడుదల చేశారు.ఎమ్మేల్యే ప్రకటన సారాంశం ఇలా ఉంది. ఆగస్టు 7న కాలువలకు నీళ్లు విడుదలయ్యాయని తెలిపారు. మూడు పంపులతో 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. మోటర్లు ఆన్ చేయలేదని ఏ ఆధారంతో మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, కృష్ణాలో వరదలు వస్తున్నా, ప్రభుత్వం నీటిని వినియోగించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే బట్ట కాల్చి మీద వేయడం తప్ప అందులో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
నీటి పారుదల వ్యవస్థలో, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడడం అవివేకం కాదా అన్నారు.
ఎంజీకే ఎల్ ఐ లిప్ట్--1 పంపుల ద్వారా ఆగస్ట్ 1 నుంచే నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయన్నారు . ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి 2.7 టీ ఎంసీ ల నీటిని ఎత్తిపోశాం అని ఆయన వెల్లడించారు . ఎల్లూరు రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 0.355 టీ ఎంసీలు లు కాగా ప్రస్తుతం 0.34 టీ ఎంసీల నీరు ఉందని ఆయన గుర్తు చేశారు .
----- సింగోటం రిజర్వాయర్ ..
సింగోటం రిజర్వాయర్ నీటి సామర్థ్యం 0.55 టీ ఎంసీలకు గాను ప్రస్తుతం 0.40 టీ ఎంసీల నీరు ఉందన్నారు.వాస్తవాలను తెలుసుకోకుండా మోటర్లు ఆన్ చేయలేదని ఏ లెక్క ఆధారంగా చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఆగస్ట్ 1 నుంచి లిఫ్ట్-2 ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. అదే విధంగా జొన్నలబొగడ రిజర్వాయర్ సామర్థ్యం 2.14 టీ ఎంసీలు కాగా, ఆగస్ట్ 7నాటికి
నీటి మట్టం 404.80 మీటర్లని, ఎఫ్ ఆర్ ఎల్
407.00 మీటర్లన్నారు. ప్రస్తుత నీటి నిల్వ 1.753. టీ ఎంసీలన్నారు. మూడు పంపుల ద్వారా ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో: 2,100 క్యూసెక్కులని మూడు పంపులు పనిచేస్తున్నాయని,
ఆ నీటిని ఎత్తిపోస్తున్నా నీరు రిజర్వాయర్‌లోకి వస్తోందన్నారు . 29 ప్యాకేజ్ కల్వకుర్తి ఎడమ కాలువ ద్వారా 2,100 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు .
గుడిపల్లిగట్టు రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 0.62 టీ ఎంసీలు కాగా, ప్రస్తుతం 0.42 టీ ఎంసీ ల నీరు ఉందన్నారు.ఆగస్ట్ 7 న అన్ని కాలువలకు సాగునీటిని విడుదల చేశామని ఆయన స్పష్టం చేశారు. గుడిపల్లి రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తి సాగునీటిని కాలువలకు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు కళ్లముందు ఉండగా, “మోటర్లు ఆన్ చేయలేదు నీళ్లు ఇవ్వడం లేదు” అని చెప్పడం సిగ్గుచేటు కాదన్నారు. ఒక సిపాయి లాగా మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకొని ఉంటే బాగుండేదని ఆయన చమత్కరించారు.
---- 
కాంగ్రేస్ ప్రభుత్వం ప్రచారం కోసం కాదని, రైతు సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తోందన్నారు. ఏదో ఒక పని చేసినట్టు చూపించడానికి షో పుటప్ కార్యక్రమాలు చేయడం మాకు అలవాటు లేదన్నారు.
నీటి గురించి మీరు నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందన్నారు.
రైతుల ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరి దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన పరిస్థితి లేదని తెలిపారు .ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచించాలి ఇందులో ఏదైనా తేడా ఉందనిపిస్తే మేము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు .
