కన్నీటి వేళ కొండంత అండ..

కష్టాల్లో మనీషా లక్ష్మీ మదన్‌లాల్ భరోసా

Published On
కన్నీటి వేళ కొండంత అండ..

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి ( సింగరేణి): లోకల్ గైడ్, ఆగస్టు 8: ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు మనీషా లక్ష్మీ మదన్‌లాల్ శనివారం సింగరేణి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

మాదారం ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన మాజీ దిశా కమిటీ సభ్యులు లకావత్ లక్ష్మణ్, ప్రజాపక్షం విలేకరి లకావత్ రాముల నాయనమ్మ లకావత్ అంజి (101) ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మనీషా లక్ష్మీ మదన్‌లాల్ వారి ఇంటికి వెళ్లి మృతురాలి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం గుంపేల్లగూడెం గ్రామానికి చెందిన తాటి నారాయణ (60) మృతి చెందిన విషయం తెలుసుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

అదే గ్రామానికి చెందిన పొదిరి శ్రీను పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మనీషా లక్ష్మీ మదన్‌లాల్ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి అవసరమైన సమయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు.

మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడమే కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సైతం స్వయంగా కలిసి ధైర్యం చెప్పడం ద్వారా ప్రజల పట్ల తనకున్న ఆత్మీయతను మనీషా లక్ష్మీ మదన్‌లాల్ చాటుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామిగా నిలవడం అభినందనీయమని పలువురు అన్నారు.

ఈ పర్యటనలో మాజీ జడ్పీటీసీ సభ్యులు వాంకూరోత్ జగన్ నాయక్, మండల నాయకులు డొంకెన రవీందర్, తాత వెంకన్న, రవీందర్ రెడ్డి, కొత్తతండా సర్పంచ్ ధారావత్ మంగీలాల్, సూర్యతండా మాజీ సర్పంచ్ జరుపుల హచ్చు, కిలారి వెంకటేశ్వర్లు, మండల యువ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు సోమందుల నాగరాజు, జడల కళ్యాణ్, మూతి కోటేశ్వరరావు, గుగులోత్ జుంకీలాల్, ధారావత్ వికాస్, భూక్య మధు, పొక్కిలి యుగంధర్, గంగారబోయిన మురళి, రాజేష్ నాయక్, పలిక వీరస్వామి, కోటి, పొడుగు హరీష్, చింతల సంపత్, దానబోయిన సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్ గోదావరి జలాలను త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలి... జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్
*జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి* కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై నిరంతర నిఘా
కల్లుగీత కార్మికుల సుదీర్ఘ పోరాటాల ఫలితమే పాపన్న విగ్రహ ఆవిష్కరణ
వెల్కటూరులో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం
వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ..!    
ఖమ్మంలో రైతు కూలీల జాతీయ మహాసభలకు సన్నాహాలు
వృద్ధుల పట్ల గౌరవం – సమాజ ప్రగతికి ప్రతీక
22ఏ నిషేధిత భూములపై సమగ్ర విచారణ జరపాలి