- District News
- Nizamabad
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ / సబ్ - ఇన్స్పెక్టర్ పోస్టులకు ఉచిత శిక్...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ / సబ్ - ఇన్స్పెక్టర్ పోస్టులకు ఉచిత శిక్షణ
పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 18:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో గల నిరుద్యోగ యువతి , యువకులకు అర్హత కలిగిన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ నియామకాలకు ఉపయోగపడే విధంగా ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంద ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలియజేశారు.
1. దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అందించబడే *Google Form లింక్ క్యూ ఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు ఫారం దరఖాస్తు చేసుకోవలెను.
2. స్క్రీనింగ్ టెస్ట్:
ఆగష్టు 23 న (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు
1) నిజామాబాద్ డివిజన్ వారు విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ మాక్లూర్ పోలీస్ స్టేషన్ యందు
2) ఆర్మూర్ డివిజన్ వారు క్షత్రియ ఇంజనీర్ కాలేజీ యందు
3) బోధన్ డివిజన్ వారు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీ యందు
పరీక్షా విధానం :
ఆబ్జెక్టివ్ విధానం లో 200 మార్కులకు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పైన తెలియజేసిన సెంటర్స్ నందు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించబడుతుందని వివరించారు .
3. శిక్షణ ప్రారంభం:
స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 01 నుండి అక్టోబర్ 31 వరకు శిక్షణలో పాల్గొనవచ్చని తెలిపారు.
4. శిక్షణ సమయం :
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకూ.
2 నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్ టెస్ట్ లు నిర్వహించబదునని, అందరు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడుతుందని తెలిపారు .
5. ఫీజు:
ఇది పూర్తిగా ఉచిత కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
గమనిక :
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి సమాచారానికైనా ఈ దిగువ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరని సి పి తెలిపారు . క్రాంతి : 9951943656 , 8712533273
