- District News
- Mahabubnagar
- రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమన్న జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త
-
మహబూబ్నగర్ ఆగస్టు 18 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామపంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన కలెక్టర్, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. అలాగే, పంచాయతీ కార్యదర్శి చూపించిన కొన్ని తీర్మానాలు నకిలీవి గా ఉన్నట్లు పరిశీలనలో తేలింది.
రికార్డుల నిర్వహణకు సంబంధించిన పత్రాలు కూడా సక్రమంగా లేవని కలెక్టర్ గుర్తించారు. దీంతో గాజులపేట పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గ్రామపంచాయతీ నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దోమల నివారణ కోసం వినియోగించే ఫాగింగ్ మిషన్ల వివరాలు, వాటి సంఖ్య, నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను కూడా ఆమె పరిశీలించారు.
