- District News
- Ranga Reddy
- పేద విద్యార్థికి ఆర్థిక సహాయం
పేద విద్యార్థికి ఆర్థిక సహాయం
మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి
గండిపేట్, (లోకల్ గైడ్):
ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందించిన మణికొండ డివిజన్ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి అండగా నిలిచి ఉదారతను చాటుకున్నారు. మంగళవారం మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన భార్గవి విద్యార్థి ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల అనుకూలించకపోవడంతో కాలేజ్ ఫీజ్ చెల్లించడం ఆమెకు భారంగా మారింది. చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడడంతో విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు సహాయం చేయాలని కోరుతూ భార్గవి రామకృష్ణారెడ్డిని కోరగా దీనికి స్పందిస్తూ వెంటనే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భార్గవి చదువుకు ఎలాంటి ఆటంకం కలుగకూడదని ఉద్దేశంతో కావలసిన ఆర్థిక సహాయాన్ని మీకు అందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ పేద విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని ఆయన అన్నారు. అర్హులైన విద్యార్థుల ఉన్నత విద్య కోసం తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడు అందిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. ఆర్థిక సహాయాన్ని అందించి తన భవిష్యత్తుకు పాటలు వేసిన రామకృష్ణారెడ్డి కి విద్యార్థి భార్గవి అనే కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
