- District News
- వారం రోజులలో మహాత్మా గాంధీ పార్క్
వారం రోజులలో మహాత్మా గాంధీ పార్క్
నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి
గండిపేట్, ఆగస్టు 18 (లోకల్ గైడ్):
వారం రోజుల్లో ప్రజల అందుబాటులోనికి వారం రోజులలో మహాత్మా గాంధీ పార్క్ పున ప్రారంభం చేస్తామని నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం నార్సింగి సర్కిల్ మణికొండ డివిజన్ అల్కాపూర్ పరిధిలోని మహాత్మా గాంధీ పార్క్ పనులను ఆయన పరిశీలించారు. పార్కులో కొనసాగుతున్న పనుల పట్ల డిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా పార్కు మూతపడడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు డిసికి వివరించారు, వెంటనే పార్కును ప్రారంభించాలని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కమిషనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రానున్న వారం రోజుల్లో పార్కు ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఉన్న పున: ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
