తాండూరుకు హంగామా కాదు.. అభివృద్ధి కావాలి.

బీఆర్ఎస్ ర్యాలీలో అసభ్య నినాదాలు బాధాకరం:  - పైలట్ రోహిత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి

డీసీసీ అధికార ప్రతినిధి కె. గోపాల్
Published On
తాండూరుకు హంగామా కాదు.. అభివృద్ధి కావాలి.

లోకల్ గైడ్/తాండూరు:

తాండూరు ప్రజలకు హంగామా కాదు.. అభివృద్ధి కావాలని డీసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది కె. గోపాల్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చాలాకాలం తర్వాత తన సొంత నియోజకవర్గమైన తాండూరుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అసభ్య నినాదాలు చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్య సంస్కృతికి మచ్చ అని గోపాల్ అన్నారు.
ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి, ర్యాలీలో చోటుచేసుకున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించడంతో పాటు తాండూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ విమర్శల పరిధిని దాటి వ్యక్తిగత విమర్శలకు దిగజారాయని గోపాల్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాండూరులో జరిగిన అభివృద్ధి, అప్పట్లో వచ్చిన నిధులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన నిధులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తాండూరు ప్రజలు హంగామా, బలప్రదర్శన రాజకీయాలను కాకుండా అభివృద్ధి, ఉపాధి, విద్య, తాగునీరు, రోడ్లు, సంక్షేమం వంటి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని గోపాల్ పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పును ఇస్తారని అన్నారు.

Tags:

About The Author

Latest News

పేద విద్యార్థికి ఆర్థిక సహాయం  పేద విద్యార్థికి ఆర్థిక సహాయం 
        గండిపేట్, (లోకల్ గైడ్): ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందించిన మణికొండ డివిజన్ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి అండగా నిలిచి
తాండూరుకు హంగామా కాదు.. అభివృద్ధి కావాలి.
వారం రోజులలో మహాత్మా గాంధీ పార్క్ 
174 కిలోల కల్తీ ఖోవా పట్టివేత.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్  కానిస్టేబుల్ / సబ్ - ఇన్స్పెక్టర్ పోస్టులకు ఉచిత శిక్షణ
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
సర్దార్ పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం