విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలి 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

Published On
విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలి 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న అల్పాహారం పోషక విలువలతో సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రం కాలేజీ రోడ్డులోని కేంద్రీకృత వంటశాల ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిందని,హరే కృష్ణ ఫౌండేషన్ వారు కార్యక్రమం నిర్వహణకు ముందుకు రావడం అభినందనీయం అని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం వేళలో పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం,ఏకాగ్రత,విద్యాభ్యాసానికి తోడ్పడుతుందని తెలిపారు.అనంతరం ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 23.75కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రజల సంక్షేమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Tags:

About The Author

Latest News