నేడు బీఎల్‌ఏలతో సమీక్షా సమావేశం.

తాండూర్ నియోజకవర్గం కరణం పురుషోత్తం రావు. 

Published On
నేడు బీఎల్‌ఏలతో సమీక్షా సమావేశం.

లోకల్ గైడ్/తాండూర్:
టీపీసీసీ ఆదేశాల మేరకు తాండూర్ నియోజకవర్గంలో సర్ ఫేజ్-2 ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్ల (BLA)తో నేడు(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ సర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధ్యక్షతన, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, సర్ ప్రక్రియ పరిశీలకులు జగదీశ్వర్ రావు, వినయ్ రెడ్డి సమక్షంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మధ్యాహ్నం 2:00 గంటలకు అంతారం రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో తాండూర్ నియోజకవర్గ పరిధిలోని 269 బూత్‌ల (పోలింగ్ స్టేషన్ల) బీఎల్‌ఏలతో సర్ ఫేజ్-2 ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కాగా సర్ ఫేజ్-2 ప్రక్రియకు సంబంధించి బీఎల్‌ఏలు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు అవసరమైన సమాచారాన్ని సేకరించి పార్టీకి సహకరించాలని సూచించారు.
ఈ సమావేశానికి మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బీఎల్‌ఏలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, చైర్మన్‌లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News